రాజకీయ పార్టీలు, సినీ అభిమానులు, కులాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధించింది అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు. గురువారం రాత్రి 9.30 నుంచి శుక్రవారం రోజు ఉదయం 5 గంటల వరకు రెండు పక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. మార్చి 12 వరకు పోసాని.. ఇప్పుడు రిమాండ్‌లోనే ఉండనున్నారు. ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు.