పోసానికి మరిన్ని చిక్కులు.. ఒకేసారి మూడు వారెంట్లు

1 year ago 27
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. నరసరావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున కేసు నమోదు చేశారు. 153 ఏ 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్‌ల కింద ఆయనపై కేసు ఫైల్ చేశారు. ఈ క్రమంలో పీటీ వారెంట్‌‌తో నరసరావుపేట పోలీసులు రాజంపేట సబ్‌ జైలుకు వచ్చారు. రాజంపేట సబ్‌జైల్లో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోసానిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట టూ టౌన్ సీఐ హేమారావు ఆధ్వర్యంలో తరలించారు.
Read Entire Article