సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు కొత్త ఫిర్యాదులు, పీటీ వారెంట్లు ఇబ్బందులు పెడుతున్నాయి. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను.. పల్నాడు పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నరసరావుపేట కోర్టులో హాజరుపరచగా.. కోర్టు పదిరోజులు రిమాండ్ విధించింది. దీంతో పల్నాడు జిల్లా పోలీసులు గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళిని తరలించారు.