ప్రజా పాలన అంటే ఇదేనా..? రేవంత్ సర్కార్‌పై హరీష్ ఫైర్

3 months ago 16
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య సేవలు కుప్పకూలాయని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. తాండూరులో అంబులెన్స్ రాక రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై మహిళ ప్రసవించడం, భద్రాచలంలో వాహనం లేక మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం తెచ్చిన 108 అంబులెన్స్, పరమపద వాహనాలను నిర్వీర్యం చేశారని మండిపడుతూ.. ప్రజలు కోరుకున్న ప్రజా పాలన ఇదేనా అని ప్రశ్నించారు. తక్షణమే అత్యవసర సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article