తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న 59,400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ‘ప్రజా పాలన’ అప్లికేషన్ల ఆధారంగా సొంత జాగా, ఇల్లు లేని వారికి (L2 కేటగిరీ) అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పంపిణీ చేసి, మిగిలిన నిర్మాణ ఖర్చును లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 400 కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది.