ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ వచ్చే నెల 2వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా అమరావతిలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక ప్రధాని సభలో రాజధాని ప్రాంత రైతులు, మహిళలకు గొప్ప అవకాశం కల్పించనున్నారు.