ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఉద్యోగుల డేటా పరిశీలనలో ప్రభుత్వ జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి. ఒకే వ్యక్తి రెండేసి జీతాలు పొందినట్లు గుర్తించారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల్లో 40 కేసులు వెలుగుచూశాయి. పోలీసు శాఖలోనే 17 కేసులు నమోదయ్యాయి. అక్రమంగా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో రికవరీ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.