ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు తీపికబురు వినిపించింది. స్టీమ్ రైస్‌తో మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్నం ముద్దగా అవుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో మంగళగిరిలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కొత్త బియ్యం సరఫరా కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మధ్యాహ్న భోజనం పథకానికి స్టీమ్ రైస్ సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల వివరించారు.