ఖమ్మం జిల్లా దానవాయిగూడెం ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో చదువుతున్న ఓ విద్యార్థిని ఎలుకలు విచక్షిణారహితంగా కొరికాయి. మార్చి నుంచి నవంబర్ వరకు దాదాపు 15 సార్లు ఎలుకలు విద్యార్థిని కొరికాయి. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.