Visakhapatnam Laurus Labs To Invest Rs 5000 Crore: ఆంధ్రప్రదేశ్‌కు ఫార్మా రంగంలో మరో భారీ పెట్టుబడి వచ్చింది. విశాఖపట్నంలో లారస్ ల్యాబ్స్ రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడితో అత్యాధునిక ప్లాంట్‌ను నిర్మిస్తోంది. 532 ఎకరాల స్థలంలో రాబోయే 8 ఏళ్లలో 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. లారస్ ల్యాబ్స్ రాకతో స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతుంది అంటున్నారు.