Shamshabad Airport Busses: ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ మరో అదిరిపోయే బంఫర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇక.. ముగ్గురూ లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి గ్రూప్‌గా వెళ్తే వారికి అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.