హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ ఒక మంచి ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ ధరను తగ్గించింది. ఆగస్టు 15 నుంచి 31 వరకు ఈ టికెట్ పెద్దలకు రూ.130, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.110, పిల్లలకు రూ.90గా నిర్ణయించింది. ఈ టికెట్‌తో 24 గంటలు ప్రయాణం చేయొచ్చు. ఎండీ సజ్జనార్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రయాణికులకు ఆర్థికంగా కొంత ఊరట ఇస్తున్నాయి. గతంలో విజయవాడ మార్గంలో టికెట్ ధరలు తగ్గించడం మంచి ఫలితాలు ఇచ్చాయి.