తిరుపతి హైవేలపై ప్రమాదాలకు కారణమవుతున్న 48 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. తిరుపతి కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ విభాగాల అధికారులు మంగళవారం బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా 48 బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు.. వివిధ విభాగాల సమన్వయంతో 60 రోజుల్లోగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. చంద్రబాబు జీరో డెత్ పాలసీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు.