ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. పిల్లల ప్రాణాల మీదకు తెస్తోంది. నిర్మల్ జిల్లాలో పబ్జీకి బానిసైన ఓ విద్యార్థి ఫోన్ ఇవ్వనందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఒక్కటే కాదు.. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలా ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్.. పిల్లల ఉసురు తీస్తోంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొని పిల్లలను ఈ గేమింగ్ డిజార్డర్ నుంచి కాపాడుకోవాల్సిన అవరసం ఉంది. లేదంటే మీ కళ్ల ముందే మీ పిల్లలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ వచ్చిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.