తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 200 మంది ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ తమను వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు మంగళవారం పాఠశాల, కళాశాల ప్రహరీ దూకి కాలినడకన బీచుపల్లి నుంచి గద్వాలలోని కలెక్టరేట్‌కి 18 కి.మీ. పాదయాత్ర ద్వారా చేరుకుని సమస్యలు విన్నవించుకున్నారు.