Shocking Incident In Nalgonda: నల్గొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి మోజులో పడి ఓ తల్లి రెండేళ్ల కుమారుడిని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది. బాలుడి ఏడుపులు విని చలించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి.. బాలుడిని తండ్రికి అప్పగించారు. ఈ సంఘటన మానవ సంబంధాలు దిగజారుతున్న తీరుకు అద్దం పడుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.