కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట.. అర్ధాంతరంగా విడిపోయింది. దీంతో వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రం కావడంతో.. పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భార్య.. తాళి, మెట్టెలు, పిల్లలను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఇక భర్త కూడా పట్టించుకోకపోవడంతో పిల్లలు దిక్కులేని వారు అయ్యారు. దీంతో పోలీసులు.. ఆ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించారు.