తెలంగాణ, జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెద్దలను ఒప్పించి.. ఎంతో సంతోషంగా ప్రేమ వివాహం చేసుకున్న నవ వధువు.. పెళ్లైన ఆరు రోజులకే చనిపోయింది. దసరా పండగ నాడు పుట్టింటికి వచ్చిన యువతి అదే రోజు సాయంత్రం తిరిగి అత్తారింటికి వెళ్లింది. గురువారం అర్ధరాత్రి అందరు నిద్రపోయాక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్న తమ బిడ్డ ఉరేసుకుందని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. ఆ వివరాలు..