మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో మెుత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.