ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి స్పందించిన జగన్ .. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తారా అని నిలదీశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్ని పార్టీలనూ విమర్శిస్తారని.. విశ్లేషిస్తారని.. ప్రజా గొంతుకైనా అలాంటి వ్యక్తిపై కేసులు దారుణమంటూ జగన్ మండిపడ్డారు.