ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. కేంద్ర ప్రభుత్వం పిఠాపురం రైల్వే స్టేషన్‌కు శుభవార్త వినిపించింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్‌ను తీసుకువచ్చింది. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్‌లో రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దీంతో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.