ఏపీ ప్రభుత్వం బీఫార్మసీ లేదా డీఫార్మసీ చదివిన ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం సహకారంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఫార్మసీ చదివినవారు అర్హులు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించారు. జాతీయ పశువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.