హైదరాబాద్ ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. ముందుగా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఆ తర్వాత హెచ్‌ఎండీఏ అధికారులను ప్రశ్నించనున్నారు. వీరి వివరణల ఆధారంగా ఏ1గా ఉన్న కేటీఆర్‌కు సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.