ఐఏఎస్ అర్వింద్ కుమార్‌పై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను విచారణ జరిపేందుకు కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది. అవినీతి, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.