తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జనవరి 06న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు అధికారులకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది.