హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను ఏసీబీ విచారణకు హాజరు కాగానే.. ఇంటిపై రైడ్స్ చేయించేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.