ఫార్ములా ఈ-రేస్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రేవంత్ సర్కార్ ఈ కేసులో మరో సంచలన విషయం బహిర్గతం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి రేస్‌లో పాల్గొన్న గ్రీన్ కో కంపెనీ మధ్య లావాదేవీలు జరిగినట్లు చెప్పింది. గ్రీన్ కో, దాని అనుబంధ కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లు జారీ అయినట్లు వెల్లడించింది.