ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకినాడ పోర్టు నుంచి నౌక ప్రారంభం.. మంత్రి కళ్లల్లో ఆనందం..!

2 weeks ago 6
తెలంగాణ రాష్ట్రం బియ్యం ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లే దిశగా ముందడుగు వేసింది. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదరగా.. ఇందులో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం ఎగుమతి చేసే నౌకను.. కాకినాడ పోర్టులో ప్రారంభించారు. ఈ మేరకు.. తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టు నుంచి నౌకను జెండా ఊపి పంపించారు. తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం నౌక ద్వారా ఫిలిప్పీన్స్‌కు చేరనుంది.
Read Entire Article