తెలంగాణలోని విద్యాసంస్థల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ యాక్షన్‌లోకి దిగింది. పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టే ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఫుడ్ పాయిజన్ ఘటనలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు సీఎం శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు.