హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేళ ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహించగా.. మందుబాబులు ఫూటుగా తాగి వాహనాలతో రోడ్లపైకి వచ్చి పోలీసులకు చిక్కారు. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236, సెంట్రల్ జోన్‌లో అత్యల్పంగా 102 కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.