Phone Tapping Case Somesh Kumar: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌లను సిట్ అధికారులు మరోసారి విచారించారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ సమయంలో వీరు రివ్యూ కమిటీలో ఉండటంతో, అనుబంధ ఛార్జ్‌షీట్ కోసం ఈ విచారణలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రభాకర్ రావు నియామకం, ట్యాపింగ్ చేసిన నంబర్లపై వీరిని ప్రశ్నించారు. కస్టడీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ వేగవంతమైంది.