హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జరిగిన సిట్ విచారణ సుమారు 4 గంటల 50 నిమిషాల పాటు సాగి ఎట్టకేలకు ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన అధికారుల వాంగ్మూలాల ఆధారంగా.. విచారణ గదిలో కేసీఆర్‌ను అధికారులు లోతుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర సాధన కోసం ఏ గదిలో అయితే వ్యూహాలు రచించారో.. అదే గదిలో నేడు విచారణ ఎదుర్కోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నిరసనలు చేపట్టారు. ఉద్రిక్తతల దృష్ట్యా ముఖ్యమంత్రి నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.