ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల.. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలను రద్దు చేయగా.. ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం.. గతంలో పిల్లలను స్పెషల్ షోలకు అనుమతించొద్దని ఆదేశించింది. అయితే.. తాజాగా జరిగిన విచారణలో గత తీర్పును సవరిస్తూ కీలక ఆదేశాలిచ్చింది హైకోర్టు.