రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' నిర్వహించింది. ఈ సదస్సులో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ సమ్మిట్ ద్వారా రూ. 5.75 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ఉచిత బస్సులను నడుపుతోంది.