ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులకు రోగులు క్యూ.. తెలంగాణలో స్వైన్‌ఫ్లూ కేసులు ఉన్నాయా..?

1 hour ago 1
ఫ్లూ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య హైదరాబాద్ నగరంలో క్రమంగా పెరుగుతోంది. నల్లకుంట ప్రభుత్వ ఫీవర్‌ ఆసుపత్రికి రోజుకు 450–500 మంది వరకు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పితో వస్తున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటివరకు హెచ్‌1ఎన్‌1 లేదా స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ కాలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఆగస్టులో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు లేవని అన్నారు. తీవ్రమైన లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article