విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన మొత్తం 128 కొత్త జీవాలు జన్మించాయి. దీనిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని, ఇది రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలకు మరింత బలం చేకూరుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పునరుత్పత్తి ప్రక్రియలో భాగస్వాములైన అటవీ శాఖ అధికారులు, జూలాజికల్ పార్క్ సిబ్బంది, వెటర్నరీ బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.