ఏపీ త్వరలోనే బంగారం ఉత్పత్తికి చిరునామాగా మారుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలులోని జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత మనదగ్గరే బంగారం ఉత్పత్తి చేసుకోవచ్చని అన్నారు. ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి చేస్తామని.. వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి టార్గెట్‌గా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే నెలలోనే జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.