బంగారం ధరలు చుక్కలనంటుతున్న వేళ.. హైదరాబాద్‌లో నకిలీ బంగారం ముఠా రెచ్చిపోయింది. పంజాగుట్టలో ఓ నగల దుకాణానికి పాత కస్టమర్ ద్వారా వచ్చిన ఇద్దరు వ్యక్తులు 98 తులాల నకిలీ బంగారం ఇచ్చి రూ.42 లక్షలు కాజేశారు. అంటే తులం బంగారం దాదాపు రూ.43 వేల వరకే వస్తుందని ఆశ పడ్డాడు. చెక్ చేసుకోకుండా.. ఆ డబ్బులను ఇచ్చేశాడు. తీరా.. మోసపోయినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.