బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

1 month ago 3
Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న రెండు రోజుల్లో తమిళనాడు తీరం దిశగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇవాళ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది.. మంచు కురవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
Read Entire Article