తెలంగాణలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.