ఈసారి రుతుపవనాలు ముందుగానే రావడంతో రైతులు పంటల సాగు మొదలుపెట్టారు. అయితే జూన్‌లో వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు మాడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఆ వివరాలు..