బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడినట్టు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇది క్రమంగా ముందు సాగి.. గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అలాగే, బుధవారం ఉదయం వరకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉంది.