Andhra Pradesh Weather Report Today: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని చెబుతున్నారు. అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు. ఈ నెల 18 వరకు వానలు కురుస్తాయంటున్నారు. అంతేకాదు ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు.. ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.