బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో HMDA భూముల వేలం.. అప్‌సెట్ ధరలు ఇవే..

1 month ago 9
తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు హెచ్‌ఎండీఏ ద్వారా హైదరాబాద్‌లోని 176 ప్రైమ్ ప్లాట్లను ఈ-వేలానికి తెచ్చింది. జూన్ 17 నుండి 30 వరకు ఈ వేలం జరగనుంది. తొలిసారిగా బంజారాహిల్స్‌లోని 8.24 ఎకరాల భూమిని ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధరతో వేలం వేస్తున్నారు. ఈ మెగా వేలం ద్వారా రూ.1500 కోట్ల ఆదాయాన్ని అధికారులు ఆశిస్తున్నారు. మోకిలా, మేడిపల్లి, నార్సింగి, చందానగర్ వంటి ప్రాంతాల్లో గజానికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు అప్‌సెట్ ధరలను నిర్ణయించారు. బంజారాహిల్స్ భూమికి జూన్ 19న వేలం జరగనుంది.
Read Entire Article