బంజారాహిల్స్‌లో హై టెన్షన్.. ఆ వైపు వెళ్లే అన్ని మార్గాలు మూసివేత

7 months ago 10
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు నంబర్ 12లోని పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆలయం కూల్చివేతపై స్థానికులు, హిందూ సంఘాలు, పలువురు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ఆలయం కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం హిందూ సంఘాలు కుంకుమార్చన పూజకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాలను మూసివేయడంతో ఉద్రిక్తత పెరిగింది. అంతేకాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో సహా పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు.
Read Entire Article