పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ రాకపోవడం, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఐదు బృందాలతో గాలింపు చేపట్టడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించినట్లు ప్రకటించగా.. పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మేడ్చల్ న్యాయమూర్తి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.