బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ఆరెస్సెస్ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంతో ఆరెస్సెస్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలోకి ఆరెస్సెస్ కార్యకర్తల పేర్లు లాగడంపై.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరెస్సెస్‌పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు చేసింది.