బండి భగీరథ్ పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బాధితురాలి తల్లి శుక్రవారం ఒక లేఖను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను ప్రచారం, ప్రతీకారం కోసం తాను పోరాటం చేయడం లేదని.. న్యాయం కోసం చేస్తున్నట్లు వెల్లడించారు. తన కుమార్తెకు భద్రత, గౌరవం, భవిష్యత్ కావాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. తమకు చట్టం, రాజ్యాంగంపై నమ్మకం ఉందని.. మీడియా, సోషల్ మీడియా తమ వ్యక్తిగత సమాచారాన్ని వైరల్ చేయవద్దని కోరారు. అది తమ కుమార్తెను మరింత కుంగదీస్తుందని చెప్పారు.