బండి భగీరథ్ పోక్సో కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవి దేవిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. బెయిల్ ఇస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సాగిన ట్రోలింగ్‌పై హైకోర్టు రిజిస్ట్రార్ బి.ఎస్. చిరంజీవి చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.