కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రారంభించిన.. ఇందిరిమ్మ ఇండ్ల పథకానికి ప్రధాని ఆవాస్ యోజన పేరు పెట్టాలని, కొత్త రేషన్ కార్డులపై కాంగ్రెస్ ఫొటోలు పెట్టోద్దని.. అలా అయితేనే కేంద్రం డబ్బులు మంజూరు చేస్తుందని.. అలా చేయకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వమని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. అయితే.. మొన్ననే మా మధ్య ఎలాంటి గ్యాప్స్ లేవంటూ బండి సంజయ్ చెప్పారు.